కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. 15 రోజుల క్రింత చనిపోయిన వ్యక్తిను సమాధి నుంచి బయటకు తీసి ఎముకలను ఎత్తుకెళ్లారు. అమావాస్య రోజున శవం నుంచి ఎముకలు తీయటం, క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలుసులు శవాన్ని బయటకు తీసి ఎముకలు ఎత్తుకెళ్లిన ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.