తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం కేటీఆర్, కవిత సహా పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసు వ్యానుల్లో అక్కడి నుంచి తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మల్యేలు రేవంత్, అదానీతో కూడిన టీషర్టు ధరించడం పట్ల అసెంబ్లీ సెక్యూరిటీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ గేట్ -2 వద్ద ఉద్రిక్తత నెలకొంది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడ్నుంచి తరలించారు.