ఆ 11 గొర్రెలే గర్జించే సింహాలవుతాయ్.. పృథ్వీ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రియాక్షన్

2 months ago 4
లైలా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ చేసిన 11 గొర్రెలు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. సినిమా ఫంక్షన్లలో మాట్లాడేటప్పుడు హుందాగా ఉండాలని.. రాజకీయ వ్యాఖ్యలు సరికావని సూచించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న వైసీపీ ఎమ్మెల్యే.. వ్యక్తిగత కక్షలతో ఇండస్ట్రీని బలి చేయొద్దన్నారు. ఆ 11 గొర్రెలే.. గర్జించే సింహాలై, శత్రవులను చీల్చి చెండాడుతాయని హెచ్చరించారు. మరోవైపు పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై హీరో విశ్వక్ సేన్ కూడా ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.
Read Entire Article