తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగాతారామతి బారాదరిని పర్యాటక స్థలంగా మరింతగా అభివృద్ధి చేయాలని, దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. టూరిజం హబ్ డెవలప్‌మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలని.. అక్కడ ఉన్న వీరభద్రస్వామి దేవాలయానికి యాదాద్రి తరహాలో టెంపుల్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకాధికారిని నియమించాలని ఆదేశించారు.