ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ కేడర్ కేటాయింపులు ప్రక్రియ గడువు పొడిగించింది. అలాగే ఉద్యోగ నియామకాలు, బదిలీలు, డిప్యుటేషన్లు, ప్రమోషన్లపై జులై 13 నుంచి నిషేధం అమలు చేయనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి మెమో జారీ అయ్యింది. కొన్ని శాఖలలో ఇంకా కేడర్ కేటాయింపుల ప్రక్రియ పూర్తి కాకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.