ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ సంతానానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు ఐదు వేల రూపాయలు నగదు ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన మూడు జంటలకు ఈ ప్రోత్సాహకం అందించనున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల కోసం ఏపీ ప్రభుత్వం రూ.56 లక్షలు విడుదల చేసింది.