కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన జ్ఞానేశ్వరి కేసు మరో మలుపు తిరిగింది. చిన్నారి అదృశ్యమైన రోజు ఊరిలో ఓ కారు అనుమానాస్పదంగా తిరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. రెండు రోజుల ముందు నుంచి కారు అనుమానాస్పదంగా తిరిగిందని.. అదే కారు జ్ఞానేశ్వరి తాతను కూడా ఢీకొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తుని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. పాప కనిపించకుండా పోయి ఇప్పటికి నెలరోజులు దాటింది.