ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సీఎం అయ్యే అర్హత ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నల్లగొండ కలెక్టరేట్‌లో అదనపు బ్లాక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వీరి నేతృత్వంలో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని చెప్పారు. గతంలోనూ రాజగోపాల్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయగా.. తాజా వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.