Chandrababu Met With Two Tdp Workers: ఇద్దరు టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజుయాదవ్‌ను సచివాలయంలోని తన ఛాంబర్‌కు వారిని పిలిపించుకొని మాట్లాడారు. చంద్రబాబు వారిద్దరి కుటుంబ నేపథ్యం తెలుసుకున్నారు.. వారితో ఫొటోలు దిగారు. పిల్లలకు, మీకు ఏం కావాలని దుర్గాదేవిని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు చూపిన ఆప్యాయత, సామాన్య కార్యకర్తలమైన తమను గుర్తించిన తీరుతో దుర్గాదేవి, శివరాజుయాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టుచేసి రాజమహేంద్రవరం జైల్లో ఉంచినప్పుడు కొన్ని రోజులపాటు వారు అక్కడే ఉన్నారు.