తెలంగాణలోని విద్యుత్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. ఉద్యోగుల కోసం కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని 20 వేల మెగావాట్లకు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.