తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ప్రభుత్వం పలు పథకాలు, ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ నిధులు, బకాయిలను విడుదల చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు అక్టోబర్ నెల జీతాలు విడుదల చేసింది. సుమారు రూ.46 కోట్లకు పైగా నిధులను వారి ఖాతాల్లో జమ చేసింది. అయితే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారి ఖాతాల్లోనే నిధులు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.