తెలంగాణలో కాకతీయుల చరిత్రకు సాక్ష్యంగా.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని అనాసాగరంలో కొత్త శాసనం బయటపడింది. ఇది కాకతీయ గణపతిదేవుని కాలం నాటి రేచర్ల రెడ్డిరాజుల దానశాసనం. కట్టా శ్రీనివాస్ గుర్తించి.. తెలుగు లిపిలో ఉన్న ఈ శాసనాన్ని చదివారు. దీనిపై శివలింగం, సూర్యచంద్ర చిహ్నాలు ఉన్నాయి. నాలుగు అడుగుల పొడవున్న ఈ రాతిబండ ఆనాటి పాలన, దానధర్మాలు, సామాజిక జీవనంపై విలువైన సమాచారం అందిస్తుందన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.