వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండటంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవడం మీరెవరైనా చూశారా అంటూ స్పీకర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు సభకు సగౌరవంగా రావాలన్నారు. కానీ సభ్యులు ఎవరికీ కనపడకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిన పనేముందని అసహనం వ్యక్తం చేశారు. అలా వచ్చి వెళ్లడం వారి గౌరవాన్ని పెంచదన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వీరెవరూ సభకు హాజరు కాలేదన్నారు. వేర్వేరు తేదీల్లో వీరు రిజిస్టర్‌లో సంతకాలు చేసినట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. హాజరుపట్టిలో వారి సంతకాలు ఉన్నా వాళ్లు సభకు వచ్చినట్టు స్పీకర్‌గా తాను గుర్తించలేదన్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు తలవంపులు తేవొద్దన్నారు.