Srikakulam District 7 Railway Stations Shifted To South Coast Railway Zone: శ్రీకాకుళం జిల్లావాసుల చిరకాల కోరిక నెరవేరింది. శ్రీకాకుళం జిల్లాలోని పలాస ఇచ్ఛాపురం సెక్షన్‌లోని ఏడు రైల్వే స్టేషన్‌లను..ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని కుర్దా రోడ్ డివిజన్ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోని విశాఖపట్నం డివిజన్‌కు మార్చారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎన్నో ఏళ్ల కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.