SIT Finds 600 Phones Tapped in One Day: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒకే రోజు 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారనే వార్త కలకలం రేపుతోంది. 2023 ఎన్నికల సమయంలో నామినేషన్ల ఉపసంహరణ రోజున ఈ ట్యాపింగ్ జరిగిందని తెలుస్తోంది. మావోయిస్టుల ముసుగులో ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీలోని కొందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.