హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం రాజకీయ వేడిని పెంచేస్తున్నాయి. ఓవైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు మూసీ ప్రక్షాళనతో నగరంలో పరిస్థితులు వేడెక్కాయి. హైడ్రా, మూసీ బాధితుల పక్షాన ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుతో పాటు పలువురు నేతలు గళం వినిపిస్తుండగా.. కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే.. హరీష్ రావుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. ఇద్దరు నేతల మధ్య ట్వీట్ల యుద్దం నడుస్తోంది.