Ranganath on Sangareddy Demolitions: హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల అంశం ఇప్పుడు రాష్ట్రంలో అగ్గి రాజేస్తోంది. ప్రస్తుతం.. మూసీ పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న సర్వే విషయంలో హైడ్రాపై జరుగుతున్న ప్రచారంపై ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న సర్వేకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు.. ఇటీవల సంగారెడ్డిలోని మల్కాపూర్ చెరువులో జరిగిన కూల్చివేతలకు కూడా హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.