గణేష్ మండపాలు పెట్టే నిర్వాహకులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్.. గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని నిర్ణయించగా.. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకున్నా తాను మాత్రం కరెంట్ ఖర్చునంతా తానే భరిస్తానని ప్రకటించారు. గణేష్ నవరాత్రోత్సవాలపై కరీంనగర్ కమిషనరేట్ కార్యాలయంలో బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో గణేష్ మండపాల నిర్వాహకులకు కొన్ని కీలక సూచనలు చేశారు బండి సంజయ్.