ఆ జాలర్లకు వింత అనుభవం.. చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో తెలుసా..

1 week ago 8
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాలర్లకు వింత అనుభవం ఎదురైంది. అశ్వారావుపేట మండలం తిరుమలకుంట దగ్గర వాగులో చేపల కోసం వల వేయగా ద్విచక్ర వాహనం చిక్కింది. వలలో హీరో గ్లామర్ బైక్ లభ్యమైంది. బైక్ నంబర్ TS04EE3722గా గుర్తించారు. ఈ నంబర్ పై పేరం రవీంద్ర రెడ్డి పేరుతో రిజిస్టర్ అయి ఉంది. బైక్ వాగులోకి ఎలా వచ్చిందనే దానిపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article