తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 60 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తోంది. ఈ పార్కులో 200 పరిశ్రమల కోసం లేఅవుట్ సిద్ధం చేసింది. దీని ద్వారా జిల్లాలో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసకుంటున్నారు. ఈ ఇండస్ట్రియల్ హబ్‌లో కాలుష్యరహిత, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. అలానే ఇక్కడ ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇవ్వనుంది.