సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ పరిధిలోని మేళ చెరువులో హైడ్రా చర్యలు చేపట్టింది. చెరువు FTL పరిధిలో మట్టిపోసి నింపిన ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. చెరువులోకి వాటర్ రాకుండా అడ్డుగా నిర్మించిన గోడలను హైడ్రా తొలగించింది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల మేరకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అంతే కాకుండా.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ లే అవుట్‌లో అక్రమంగా ప్లాట్లను ఆక్రమించిన వ్యక్తిపై కూడా చర్యలు తీసుకున్నారు.