తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బెంగళూరు మార్గంలో టికెట్ ధరలో 10 శాతం రాయితీని ప్రకటించింది. బెంగళూరు రూట్‌లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోనూ ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఈ స్పెషల్ డిస్కౌంట్ వల్ల ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.160 ఆదా అవుతుందని చెప్పారు.