రైతు బజార్ల ఏర్పాటుతో అటు రైతులు.. ఇటు వినియోగదారులకు మేలు జరిగింది. రైతులే నేరుగా కూరగాయలు వంటి తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడంతో ప్రజలకు ధరలు అందుబాటులో ఉంటాయి. అలాగే, దళారుల బెడద ఉండదు. ప్రస్తుతం రైతు బజార్లు ఉండగా.. ఇకపై మొబైల్ రైతు బజార్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా నేరుగా అపార్ట్‌మెంట్‌లు, శివారు ప్రాంతాలకు కూరగాయలను తీసుకొచ్చి విక్రయిస్తారు. కరోనా లాక్ డౌన్ తొలినాళ్లలో ఆర్టీసీ బస్సులను రైతు బజార్లుగా మార్చి కూరగాయాలను విక్రయించారు.