ఏ జిల్లాకు అయినా రైల్వే మార్గం ఉందంటే మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో రవాణా సౌకర్యం మెరుగు పడటంతో పాటు.. ఆ జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. తెలంగాణలోని హైదరాబాద్ లో మరో ప్రాజెక్ట్ ద్వారా 10 జిల్లాల రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ జిల్లాల మీదుగా ఓటర్ రింగ్ రైల్ పరుగులు పెట్టనుంది. అంతే కాకుండా దాదాపు 34 రైల్వే స్టేషన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. మూడు ఎలైన్ మెంట్లతో ప్రతిపాదనలు కూడా పూర్తి చేశారు. సర్వే కూడా తుది దశకు చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.