Telangana Governor Jishnu Dev Verma: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. వీటిలో ఒకటి జిన్నారం మున్సిపాలిటీలో గ్రామాలు చేర్చడానికి ఉద్దేశించిన బిల్లు.. మున్సిపల్ చట్ట సవరణకు ఆమోదం. ప్రభుత్వం పంపిన నాలుగు బిల్లుల్లో ఈ రెండింటికి మాత్రమే ఆమోదం లభించింది. అయితే.. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ అసెంబ్లీ ఆమోదించిన చట్టాలు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.