Ameenpur Demolitions: హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు అటు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే.. ఇటు సామాన్యులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. ఎవరో బిల్లర్లు అమ్మితే కొని.. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన అనుమతులతో.. బ్యాంకులు ఇచ్చిన లోన్లతో ఇండ్లు కట్టుకుంటే.. సడెన్‌గా వచ్చి ఇండ్లు కూల్చేయటం.. వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సోమవారం హైకోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.