Teenmar Mallanna: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సొంత పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మల్లన్న వ్యవహారశైలి, ఆయన చేస్తున్న కామెంట్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా మరోసారి మల్లన్న సంచలన కామెంట్లు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు.