హైదరాబాద్‌లో రోజు రోజుకు జనాభా పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభా పరంగా నగరం కూడా విస్తరిస్తోంది. దీంతో.. కేవలం నగరంలోనే కాదు.. శివారు ప్రాంతాలు కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. అభివృద్ధితో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో.. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే.. మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి వరకు రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు.