పర్యావరణ పరిరక్షకుడు, పద్మశ్రీ పురస్కారం అందుకున్న వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూశారు. కోటి మొక్కలు నాటి పచ్చదనం ప్రాముఖ్యతను చాటిన ఆయన.. తన జీవితాన్ని పర్యావరణానికి అంకితం చేశారు. ఖమ్మం జిల్లాలోని స్వగ్రామం రెడ్డిపల్లిలో విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించారు. ఖమ్మం-తీర్థాల రహదారిలో కిలోమీటర్ల మేర పచ్చని వనాన్ని సృష్టించి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు.