AP CM Chandrababu Naidu: మామిడి రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తోతాపూరి మామిడికి మద్దతు ధర కల్పించేందుకు రూ. 260 కోట్లు విడుదల చేసింది. కిలోకు రూ. 4 సబ్సిడీతో 6.5 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేయనున్నారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కూడా అందనుంది.