మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. తాను ఎందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి వచ్చిందో వివరించారు. వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందన్న విజయసాయిరెడ్డి.. ఆ కోటరీనే తాను పార్టీ వదిలి వెళ్లడానికి కారణమని ఆరోపించారు. ఇప్పుడు తాను సొంతంగా పార్టీ పెడుతుంటే అదే కోటరీ తనను విమర్శిస్తోందంటూ లేఖలో పేర్కొన్నారు.