తెలంగాణలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం కొత్త టైమ్ టేబుల్‌ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో ఈ కొత్త విధానం అమలవుతుంది. దీనిని ప్రీ-క్లాస్‌రూమ్, క్లాస్‌రూమ్, పోస్ట్-క్లాస్‌రూమ్ కార్యకలాపాలుగా విభజించారు. రాష్ట్రంలోని 205 గురుకులాలకు ఈ కొత్త షెడ్యూల్ వర్తిస్తుంది. ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అజయ్ కుమార్, ఇతర టీచర్లు ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.