తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరించింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు పాలసీలను కొనసాగించినప్పుడు అభివృద్ధి సాధిస్తాయని చెప్పుకొచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు చైనా తర్వాత తెలంగాణనే బెస్ట్ డెస్టినేషన్ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.