బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అక్కినేని కుటుంబం, సమంతలపై చేసిన అనుచిత కామెంట్లపై తాజాగా మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తనను కించపరిచేలా మాట్లాడిన కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ఓ కుటుంబం గురించి మాట్లాడవలసి వచ్చిందన్నారు. ఆ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.