Rajampet Temple Hundi Devotee Drop Diamond: అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో ఒక వజ్రం లభ్యమైంది. 1.39.6 క్యారెట్ల ముడి వజ్రంగా గుర్తించిన అధికారులు, దానితో పాటు ఒక లేఖను కూడా కనుగొన్నారు. భక్తుడు ఆ వజ్రాన్ని స్వామివారి ఆభరణాల కోసం వినియోగించాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగుతుండగా, కృష్ణా నది తీరంలోనూ ప్రజలు వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. గుడిమెట్ల సమీపంలో ఓ కుటుంబానికి రూ.10 లక్షల విలువైన వజ్రం దొరికినట్లు సమాచారం.