ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవంను జూన్ 21న వేడుకగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి యోగా గురువు బాబా రాందేవ్ కూడా హాజరయ్యారు. అయితే గంట కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 600 కోట్లు ఖర్చు భారీగా ఖర్చు చేసిందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది.