Andhra Pradesh Etikoppaka Toys Shakatam: డిల్లీలో ప్రతి ఏటా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తారు. అయితే ప్రతి రాష్ట్రం నుంచి శకటాలు అక్కడ పరేడ్‌కు వెళతాయి. ఈ మేరకు వచ్చే ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచి శకటం ఎంపికైంది. ఈసారి ఏటికొప్పాక బొమ్మల శకటంను ఎంపిక చేశారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈసారి శకటం ఉండబోతోంది అంటున్నారు ప్రభుత్వ అధికారులు.