ఆంధ్రప్రదేశ్‌లో జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమ్మతి తెలిపారని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాల్లో.. జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని నిర్వహిస్తారు. 450 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉత్సవానికి రాష్ట్ర పండుగగా ప్రకటిస్తే.. కోనసీమ ప్రాంత ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుంది.