Mlc Sipai Subramanyam Kidnapped: ఏపీలో ఎమ్మెల్సీ కిడ్నాప్ అంటూ ఆరోపణలు వచ్చాయి. తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను కిడ్నాప్ చేశారని ఆ పార్టీ ఆరోపించింది. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో సిపాయి ఓటు వేయకుండా టీీడీపీ ఇలా చేసిందని వైఎస్సార్‌సీపీ ట్వీట్ చేసింది. రెండు రోజులుగా డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారం ఉద్రిక్తంగా మారింది. కూటమి, వైఎస్సార్‌సీపీ మధ్య వార్ నడుస్తోంది. సోమవారం జరగాల్సిన ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది.