Andhra Pradesh Rs 200 Crore Stadium: ఏపీ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కొత్త స్టేడియంపై ప్రకటన చేశారు. అమరావతిసచివాలయంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పులువురు దివ్యాంగులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా స్టేడియం నిర్మాణంపై స్పందించారు. విశాఖలో రూ.200 కోట్లతో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, త్రీ వీలర్స్ అందజేస్తున్నట్లు తెలిపారు మంత్రి.