ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయే ఆక్వా రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో కలిసి బీమా పథకం అమలు చేస్తోంది. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన పథకం ద్వారా బీమా సదుపాయం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో చేపలు, రొయ్యల చెరువులు నిర్వహించే ఆక్వా రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నష్ట భయం లేకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.