కొత్తగూడెం టౌన్‌లో మాటలు స్పష్టంగా రాని ఓ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆటో ఎక్కిన ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మరో వ్యక్తితో కలిసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు బంధువులకు విషయం చెప్పగా.. సినీఫక్కీలో వారు ఆటో డ్రైవర్‌ను పట్టుకున్నారు.