హైదరాబాద్ శివారులోని ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న బలేనో కారు లారీని ఢీకొనడంతో ఈ విషాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ప్రమాదం వెనుకగల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు..