తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 'భూ భారతి' చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఆధార్ తరహాలో భూమికి సంబంధించి సర్వే చేసి 'భూధార్' తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. తొలి దశలో నాలుగు మండలాల్లో భూ భారతిని అమలు చేస్తామని తెలిపారు.