ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. రూ. 94 లక్షలు పోగొట్టుకున్న లైన్‌మెన్‌

1 hour ago 1
రామగుండంకు చెందిన టీజీఎన్‌పీడీసీఎల్ లైన్‌మెన్ సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకొని రూ. 94.11 లక్షలు పోగొట్టుకున్నారు. ఫేస్‌బుక్‌లో వచ్చిన ఒక ట్రేడింగ్ యాడ్ క్లిక్ చేసిన బాధితుడిని వాట్సాప్ ద్వారా సంప్రదించిన సైబర్ కేటుగాళ్లు భారీ లాభాల ఆశ చూపి పెట్టుబడులు పెట్టించారు. నకిలీ యాప్ ద్వారా లాభాలు వస్తున్నట్లు నమ్మించి నవంబర్ 2025 నుంచి మార్చి 2026 మధ్య కాలంలో దఫదఫాలుగా డబ్బు వసూలు చేశారు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు.
Read Entire Article