తెలంగాణ డైనమిక్ ఐఏఎస్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్.. ప్రస్తుతం ఏం ట్వీట్ చేసినా చర్చనీయాంశమే అవుతోంది. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంపై స్పందించిన స్మితా సబర్వాల్.. ట్విట్టర్‌లో చేసిన పోస్టులపై తీవ్ర దుమారమే చెలరేగిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు కూడా స్మితా సబర్వాల్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పూజా ఖేద్కర్‌కు నోబెల్ ఫ్రైజ్ ఇవ్వొచ్చంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.