తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీలతో పాటు మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ, మూసీ అభివృద్ధి, హెచ్‌జీసీఎల్ అదనపు బాధ్యతల నుంచి ఆమ్రపాలి కాటాను రిలీవ్ చేసిన రేవంత్ సర్కార్.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. మూసీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా దాన కిశోర్‌కు, హైదరాబాద్ గ్రోత్‌కారిడార్ లిమిటెడ్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీవాస్తవ నియమితులయ్యారు.