హైదరాబాద్ శివారు నార్సింగిలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపింది. చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి బాలికను తీసుకెళ్లిన నిందితుడు.. అఘాయిత్యానికి ఒడిగట్టి ఆపై దారుణంగా హతమార్చాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించగా.. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.