టీడీపీ అంటే బలహీన వర్గాలు బలహీన వర్గాలంటే టీడీపీ అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. బీసీలలకు కూటమిలో ప్రాధాన్యత ఇచ్చామని.. రాజ్యసభ సభ్యులు మూడిట్లో రెండు స్ధానాలకు బీసీలకు అవకాశం ఇచ్చారన్నారు. 42 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణంలో బీసీలకు పెద్ద పీట వేశామన్నారు. గత ఐదేళ్లలో వ్యవస్ధలన్నీ ఛిన్నభిన్నం చేశారని మండిపడ్డారు.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. రాజ్యసభ సభ్యులు రాష్ట్రం కోసం పని చేయాలి అని సూచించారు మంత్రి అచ్చెన్నాయుడు.