తెలంగాణలో ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డును ఆరు వరుసల వెడల్పుతో నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. భూసేకరణపై దీని ప్రభావంపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం భూసేకరణ పూర్తయినట్లు సమాచారం. ఈ రహదారి ఉత్తర , దక్షిణ భాగాల్లో విస్తరించి ఉమ్మడి మెదక్ జిల్లాకు భారీగా ప్రయోజనం చేకూర్చనుంది. అయితే.. భూములు కోల్పోయిన నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులు ఇక్కడ కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు రీజినల్ రింగురోడ్డు నిర్మాణం కోసం మరోసారి భూ సేకరణ చేస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.